ఇంటర్ జవాబుపత్రాల వాల్యువేషన్లో ఎలాంటి లోపాలు లేవన్న నిపుణుల కమిటీ

Intert Exam Valuation Correct

ఇంటర్ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల వాల్యూయేషన్‌లో ఎలాంటి లోపాలు లేవని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇవాళ నివేదిక ఇచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సోమవారం నాడు ప్రాథమిక నివేదికను అందించింది. గతంతో పోలిస్తే రీ వాల్యూయేషన్ కోసం ధరఖాస్తులు తక్కువగా వచ్చాయని నిపుణుల కమిటీ తేల్చింది. ఇంటర్ బోర్డులో ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న విబేధాలే దీనికి కారణమని కమిటీ తేల్చింది.

2017 లో రీ వాల్యూయేషన్ కోసం16680, 2018లో 17491 ధరఖాస్తులు వచ్చినట్టుగా నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది కేవలం 4000 ధరఖాస్తులు మాత్రమే వచ్చాయని నివేదిక తేల్చింది.టెక్నికల్ అంశాలపై ఇంకా లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడుతోంది. ఇంటర్ పరీక్షల్లో చోటు చేసుకొన్న అవకతవకలపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడ పాల్గొన్నారు. దీంతో ఇవాళ ఇంటర్ బోర్డు ఎదుట ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *