రాజమౌళిపై యుద్ధం ప్రకటించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

NTR fans angry on Rajamouli

రాజమౌళి మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఏ టైమ్ లో మొదలుపెట్టాడో కానీ అన్నీ అవాంతరాలే. మొదట్లో ఇద్దరు హీరోల అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న జక్కన్న ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఫేస్ చేయబోతున్నాడు. రీసెంట్ గా ఏప్రిల్ 27న ఈ సినిమాలోని హీరో రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఓ పవర్ ఫుల్ వీడియో విడుదల చేశాడు రాజమౌళి. దానికిఅద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి మరో వీడియో ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఈ సారి ‘‘తన బర్త్ డే కు ఎలాంటి స్పెషల్ వీడియోస్ కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ విడుదల చేయడం లేదు. వాళ్లుచాలా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇప్పటి వరకూ నా బర్త్ డేకు మీరు ఎన్నో చేశారు. అవన్నీ ఈ కరోనా వల్ల ఆపేయండి. అలాగే కొత్త వీడియోతో మిమ్మల్ని అలరించలేకపోతున్నాను’’ అంటూ ఎన్టీఆర్ ఓ లెటర్ ముందే పంపించాడు. అభిమానులను ముందే ప్రిపేర్ చేయడానికి ఎన్టీఆర్ ఈ లెటర్ పంపించాడు. కానీ.. అభిమానులకు ఎన్టీఆర్ చెప్పిన మాటలు నచ్చలేదు. అందుకే వాళ్లు అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు.

నిజానికి ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ వీడియో వస్తుందని చాలామంది ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని కీలక సీన్స్ ఇంకా  చిత్రీకరించలేదు. దీంతో ఇప్పుడు ఏ వీడియో వచ్చినా.. అది పేలవంగా ఉంటుంది.. మళ్లీ రామ్ చరణ్ వీడియోకు మ్యాచ్ కాలేదు అనే విమర్శలు వస్తాయి అనే కారణంతోనే అసలుకే వద్దనుకున్నారు. ఇది ఎన్టీఆర్ కు అర్థమైంది. కానీ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. అందుకే రాజమౌళిని ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు కొన్ని ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్స్ లో రకరకాల మెసేజ్ లు ట్రోల్ అవుతున్నాయి. కొందరైతే బాహుబలిలో కట్టప్ప బాహుబలిని చంపే ఫోటోను ట్యాగ్ చేస్తూ ప్రభాస్ ప్లేస్ లో ఎన్టీఆర్ ను కట్టప్ప ప్లేస్ లో రాజమౌళిని చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంక ఈ విషయంలో కొందరు సీనియర్ అభిమానులు కూడా రాజమౌళిపై చాలా కోపం  చూపుతున్నారు. వీళ్లంతా ఎంతో ఆశగా చూస్తోన్న  బర్త్ డే గిఫ్ట్ లేకుండా చేశాడంటున్నారు. మరి ఈ విషయంపై రాజమౌళి ఎలాగూ ఎవర్నీ లెక్క చేయడు. అందువల్ల ఫ్యాన్స్ ఇంకెంత ట్రోల్ చేస్తారో చూడాలి.

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *