ఎన్టీఆర్ 30, 31 ఏంటి బాబూ ఈ వార్తలు..?

NTR next cinemas

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ ఎంత వేగంగా వ్యాపిస్తాయో అందరికీ తెలుసు. ఇదుగో టైగర్ అంటే అదుగో టెయిల్ అనే బ్యాచ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ వార్తల కంటే రూమర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు కొత్త సినిమాల గురించి చెబుతూ.. వస్తోన్న వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. అయితే ఈ రెండు వార్తలూ నిజమే అయితే బావుంటుంది అని ప్రతి ఎన్టీఆర్ అభిమానీ కోరుకుంటాడు. వాళ్లు కోరుకుంటే మాత్రం అవుతుందా.. అసలే అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కినట్టు.. ఎన్టీఆర్ కూడా రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో చిక్కాడు కదా. అందులో నుంచి ఎప్పుడు ఎలా బయటకు వస్తాడో అతనికీ తెలియదు. కానీ ఈ లోగానే కోత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు కొందరు కోతలరాయుళ్లు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ గానే అనౌన్స్ అయింది.

హారిక హాసినితో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ కొందరు మాత్రం 30వ సినిమాగా కన్నడ కెజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అంటున్నారు. మరికొందరు.. 31వ సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ ఆట్లీతో అంటూ వార్తలు వెదజల్లుతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరితో ఎన్టీఆర్ కు కమిట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ నంబర్స్ ను డిక్లేర్ చేయడం మాత్రం అస్సలు సూట్ అవలేదు. రేపు ఏమైనా జరగొచ్చు. ఆయా దర్శకులు హీరోల డేట్లు, షెడ్యూల్స్ లో ఓ రేంజ్ లో తేడాలు వచ్చేలా కనిపిస్తోన్న తరుణంలో ఇలాంటి వార్తలు అభిమానులను ఆనందపరచడానికి తప్ప వాస్తవాలుగా పనిచేయవు. ఏదేమైనా ఈ ఇద్దరు దర్శకులతో ఎన్టీఆర్ సినిమా చేస్తే చూడాలని మాత్రం చాలామంది కోరుకుంటున్నారు అనేది వాస్తవం.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *