ఎన్టీఆర్‌..బిగ్ బాస్ 3 చేయ‌డం లేదు.. 

NTR Not working in Big Boss 3
 
బిగ్ స్క్రీన్‌పై త‌న‌దైన స్టార్ డ‌మ్‌ని సంపాదించుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. బుల్లితెర‌పై కూడా బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఆకట్టుకున్నాడు. తొలి సీజ‌న్‌లో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్ .. త‌న‌దైన శైలిలో బిగ్ బాస్ సీజ‌న్ వ‌న్‌కు క్రేజ్ తేవడంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. అయితే అర‌వింద స‌మేత కార‌ణంగా బిగ్ బాస్ సీజ‌న్ 2కి ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌లేదు. తార‌క్ స్థానంలో .. నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే సీజ‌న్ 2 అంత పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. అదీ కాక నాని తీరుపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో నాని రెండో సీజ‌న్ అయితే చాలు అనించి .. నెక్ట్స్ సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌లేన‌ని చెప్పేశాడు. ఇప్పుడు త్వ‌ర‌లోనే స్టార్ట్ చేయాల‌నుకుంటున్నా మూడో సీజ‌న్‌కు ఎవ‌రిని వ్యాఖ్యాత‌గా చేయాలో నిర్వాహ‌కుల‌కు అర్థం కావ‌డం లేదు. ఎందుకంటే తార‌క్‌పై నిర్వాహ‌కులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా.. త‌ను `ఆర్ ఆర్ ఆర్` కార‌ణంగా చేయ‌లేన‌ని చెప్పేశాడు. దీంతో నిర్వాహ‌కులు వెంక‌టేష్, అల్లు అర్జున్‌, చిరు, నాగార్జున స‌హా స్టార్ హీరోల‌ను సంప్ర‌దించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *