ఆ సినిమాలో.. అంతకుమించి..!

2
Ntr played a role as a don
Ntr played a role as a don

Ntr played a role as a don

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా రానుందనే న్యూస్ ఎప్పటినుంచో చక్కర్లు కొడుతుంది. బయోవార్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ మాఫియా డాన్‌ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్‌ కూడా డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించనున్నారని టాక్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌ 2’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరూ తమ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

కేజీఎఫ్ లో హీరో యశ్ ను రాఖీభాయ్ గా శక్తివంతమైన పాత్రలో చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీళ్. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రను కూడా అంతకుమించి చూపిస్తారని తెలుస్తోంది. త్వరలోనే జూనియర్ మాఫియా డాన్ గా  భయపెట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు.