మరోసారి శ్రీలంకలో బాంబు పేలుడు

Spread the love

One More Time Sree Lanka Bomb Blast

ఆదివారం ఈస్టర్ పండుగ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ళ ఘటన నుండి ఇంకా తేరుకోకముందే శ్రీలంక రాజధానిలోని కొలంబోలో సోమవారం సాయంత్రం మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకొంది. దీంతో ఆర్మీ సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొన్న సెయింట్ ఆంథోనీస్ చర్చి సమీపంలోనే మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకొంది.

ఇదిలా ఉంటే కొలంబో ప్రధాన బస్‌స్టేషన్ వద్ద 87 బాంబులను గుర్తించారు. ఈ బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది.ఆదివారం నాడు వరుసగా చోటు చేసుకొన్న బాంబు పేలుళ్ల ఘటనలో 295 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం నాడు చర్చి సమీపంలోనే బాంబులు పేలాయి. అయితే పేలకుండా చర్చి సమీపంలో మిగిలిన బాంబులు సోమవారం నాడు పేలాయా.. లేదా తాజాగా ఉగ్ర మూకలు బాంబులు అమర్చి విధ్వంసానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *