మోటరోలా నుంచి వన్ విజన్

ONE VISION FROM MOTO

ప్రముఖ మొబైల్ కంపెనీ మోటరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రానుంది. ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్లకు ధీటుగా అత్యాధునిక ఫీచర్లతో ఈ కొత్త ఫోన్ ను తీసుకొస్తోంది. వన్ విజన్ పేరుతో రూపొందించిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఈనెల 15న బ్రెజిల్ లో జరిగే కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. హోల్ పంచ్ డిస్ ప్లేతోపాటు 48 + 5 ఎంపీ మెగాపిక్సల్ సామర్థ్యంతో డబల్ రియర్ కెమెరా, 25 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన సెల్పీ కెమెరా ఇందులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఫీచర్లు అధికారికంగా అందుబాటులోకి రాకపోయినప్పటికీ, ఈ ఫోన్ ఫీచర్లు ఇవేనంటూ కొన్ని లీకులు దర్శనమిస్తున్నాయి. వన్ విజన్ తోపాటు మోటో ఈ6 పేరుతో మరో ఫోన్ ను కూడా ఈ సందర్భంగా లాంచ్ చేయాలని మోటరోలా భావిస్తోంది. కాగా, వన్ విజన్ ఫోన్ ధరను రూ.23,400 ఉండొచ్చని తెలుస్తోంది.

మోటరోలా వ‌న్ విజ‌న్ ఫీచ‌ర్లు ఇవే…
6.3 అంగుళాల డిస్ ప్లే
ఎగ్జినోస్ 9609 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
1080 x 2520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
48+5 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
4132 ఎంఏహెచ్ బ్యాట‌రీ

MOBILE MARKET

Get Mobile Details and Price OF Moto G7 Power

Motorola Latest mobile, mobile phone updates, mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *