దేశంలో ఉల్లి దొంగలు

Onion Robbers In The Country

దేశంలో ఇప్పుడు ఉల్లి అందరి కంటా కన్నీళ్లు తెప్పిస్తోంది. అంతేకాదు చాలా విలువైన వస్తువు అని చెబుతోంది. ఎందుకంటే దేశంలో  ఇప్పుడు ఉల్లి దొంగలు పడుతున్నారు. సినీ ఫక్కీలో ఎక్కడికక్కడ ఉల్లిపాయలను దోచుకుంటున్నారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ అనే రైతు ఉల్లి సాగు చేశాడు. అతను ఉల్లి పంటలు వేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే తన మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగు చేసిన ఆయన 350 కేజీల చిన్న ఉల్లిపాయలను 6 చిన్న గోతాల్లో ఉంచి పొలం దగ్గర ఉంచాడు. అయితే ఆ ప్రాంతాంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున నాలుగైదు రోజులుగా ఆయన పొలం వైపు వెళ్లలేదు. అయితే పొలం వెళ్లి చూసిన ముత్తు క్రిష్ణన్ షాక్ అయ్యాడు.

350 కేజీల చిన్న ఉల్లిపాయలు దొంగలు ఎత్తుకెళ్లారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక నేరుగా దగ్గర్లోని పడలూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు. ఉల్లిపాయలు ఉంచిన ప్లేస్ కూత్తనూర్-అలత్తూర్ మెయిన్ రోడ్ కి 50 మీటర్ల దూరంలోనే ఉందని,మినీ లోడ్ వాహనంతో వచ్చిన దొంగలు ఈ ఉల్లిపాయలను ఎత్తుకెళ్లి ఉండవచ్చిని అనుమానం వ్యక్తం చేశారు . నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఉల్లిపాయల విలువ మార్కెట్లో రూ.45వేలకు పైనే ఉంటుందని రైతు ముత్తుక్రిష్ణన్ తెలిపారు. ఇక ఉల్లిపాయలను ఎక్కడపడితే అక్కడ వదిలేసే పరిస్థితి లేదని వాటిని బంగారం తో సమానంగా భద్రంగా తీసుకోవాలని తాజాగా జరుగుతున్న వరుస దొంగతనాలతో అర్థమవుతోంది.

tags : India, onions price, hike, robbery, theft, onions, police case, Tamilnadu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *