కర్నూలులో ఉల్లి ధర గరిష్ఠంగా రూ.12,510

Onions Cost In Kurnool RS.12510

ఉల్లి ధరలు  కొండెక్కి కూర్చున్నాయి. అంతే కాదు రోజురోజుకీ ఘాటెక్కి పోతున్నాయి. కిలో ఉల్లి పాయల ధర వంద రూపాయలు దాటింది. కర్నూలు మార్కెట్లో ఈ రోజు మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్ఠంగా రూ.12,510 పలికింది. వినియోగదారులకు రాయితీపై ఉల్లిని అందించేందుకు రైతు బజార్లలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో ఉల్లి నిల్వలు కరువయ్యాయి. కర్నూలు మార్కెట్ కు గతంలో రోజుకు 5వేల నుంచి 6వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది.మరోవైపు ప్రజలకు రాయితీపై ఉల్లి సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం అధికారులకు సూచించడంతో… మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి. ఉల్లి ధర మాట వింటుంటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.100 మార్కును టచ్ చేసింది. భవిష్యత్ లో 150 దాకా పోతుందని భావిస్తున్నారు.

tags : onions, rates, kurnool, raithu bazar, market yard

దేశంలో ఉల్లి దొంగలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *