భారీ స్క్రీన్ తో ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్

OPPO A1K SMART PHONE

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ తో మార్కెట్లోకి వచ్చింది. అద్భుత ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఓ కొత్త ఫోన్ ను ఆవిష్కరించింది. ఒప్పో ఏ1కే మోడల్ ను మంగళవారం లాంచ్ చేసింది. 6.1 అంగుళాల వాటర్‌ డ్రాప్ డిస్‌ప్లే, ఫేస్‌ అన్‌లాక్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యం ఉన్న ఫోన్.. రూ.8490కే లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌ డీల్‌, ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్ల ద్వారా ఎరుపు, నలుపు రంగుల్లో మంగళవారం నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

ఒప్పో ఏ1కె ఫీచర్లివీ…
6.1 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్
1560 × 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
2జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్సపాండబుల్ మెమోరీ
8 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *