గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంలో మహా రాజకీయం

Opposing Governor Decision in Maharastra
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో అధికారం చేపట్టి  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోలుకోలేని షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో శివసేన, కాంగ్రెస్ పార్టీలు షాక్‌కు గురి కాగా, ఎన్సీపీలో చీలిక కొత్త సమస్యగా మారింది.  అయితే బలపరీక్షకు గవర్నర్ వారం రోజుల సమయం ఇవ్వగా.. నాలుగు ప్రధాన పార్టీలు బిజెపి, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ససేమిరా అంటున్నాయి.  అమీతుమీ తేల్చుకునేందుకు కొత్త రాజకీయానికి తెరలేపాయి.
దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లిద్దరు తాము బలపరీక్షలో నెగ్గుతామని ప్రకటించగా.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీల నేతలు ఎలా సాధ్యమో చూస్తామని అంటున్నారు. దీంతో  మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీం కోర్టు గడప తొక్కాయి. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నిర్ణయించుకున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ ఈ మూడు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తమకు 144 మందికి పైగా మద్దతు ఉందని, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ మూడు పార్టీలను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరాయి. అంతే కాదు వారం రోజుల సమయం కాకుండా బాల నిరూపణ 24 గంటల్లో  చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాయి.
ఒక పక్క బల పరీక్షకు వారం రోజుల వ్యవధి వుండడంతో బీజేపీ వ్యూహాల్లో మునిగిపోయింది.  ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పని ప్రారంభించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్) ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. అటు బిజెపి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే ఇండిపెండెంట్లను, శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలమేయడం ముమ్మరం చేసినట్లు సమాచారం.మొత్తమ్మీద ఈ వారం రోజుల డ్రామా ఎలా ఉన్నా సుప్రీం గడప తొక్కిన నేపధ్యంలో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో.
tags: Maharashtra, Congress, NCP, Shiv Sena, NCP, BJP, Sharad Pawar, Ajit Pawar, Devendra fadnavis, Uddhav Thackeray, supreem court
http://tsnews.tv/anand-mahindra-tweet-on-present-politics/
http://tsnews.tv/reasons-for-hyd-realty-down/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *