విప‌క్ష నేత వాస్త‌వాలు గ్ర‌హిస్తే మేలు

Opposition Leader Realizes The Facts

విప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు, వారి పార్టీ స‌భ్యులు వాస్త‌వాలు గ్ర‌హించి మాట్లాడితే మేలు అని, నాటి పాద‌యాత్ర‌నూ, త‌రువాత ఇప్ప‌టి పాల‌న‌నూ త‌క్కువ చేస్తూ మాట్లాడ‌డం త‌గ‌ద‌ని కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్య‌క్షురాలు కిల్లి కృపారాణి హిత‌వు పలికారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ.. పార‌ద‌ర్శ‌క పాల‌న‌కు యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, ఆ దిశ‌గా చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌లో రాష్ట్రం ఇత‌ర రాష్ట్రాల‌కే ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని అన్నారు. కానీ ఇవేవీ ప‌ట్ట‌కుండా నాటి పాద‌యాత్ర‌ను కించ‌పరస్తూ తెలుగుదేశం నాయ‌కులు వ్యాఖ్యలు చేయ‌డం ఎంత మాత్రం సమంజ‌సం కాద‌ని అన్నారు. అదేవిధంగా ఇటీవ‌ల చేసిన దిశ చ‌ట్టం రూప‌క‌ల్ప‌న ఎంతో బాగుంద‌ని, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకుంటూ చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంద‌ని, ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా కేవ‌లం ఈ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకుని బాధ్య‌తారాహిత్య విమ‌ర్శ‌లు తెలుగుదేశం పార్టీ చేస్తోంద‌ని, ఇదెంత మాత్రం త‌గ‌ద‌ని అన్నారు.ఈ నెల 21 యువ ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు వేడుక‌ల‌కూ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఇంఛార్జ్ లూ, కార్య‌కర్త‌లూ స‌మాయ‌త్తం కావాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్సీపీ న‌గ‌ర నాయ‌కులు అంధ‌వ‌ర‌పు సూరిబాబు, వ‌రం, సుగుణారెడ్డి, కామేశ్వ‌రి, తంగుడు నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *