శిధిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని పట్టించుకోరా?

OSMANIA HOSPITAL HORRIBLE CONDITION?

తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్య సేవలు అందించే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ఆసుపత్రిలో వసతులు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వైద్యులు సైతం ఆసుపత్రిలో కావలసిన సదుపాయాలు లేక సరైన వైద్య చికిత్సను అందించలేక పోతున్నారు. అలాంటి ఉస్మానియా ఆసుపత్రి బిజెపి నేతలు సందర్శించారు. తెలంగాణ సర్కార్ ఎటువంటి ఇబ్బంది లేని సెక్రటేరియట్ ను కూల్చి కొత్త భవనం నిర్మించడానికి పూనుకున్న విషయం తెలిసిందే. అయితే అవసరంలేని సెక్రటేరియట్ భవనంపైన పెట్టిన శ్రద్ధ, కెసిఆర్ నిరుపేదలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రి పైన పెట్టకపోవడం గమనార్హం.

ఇక ఉస్మానియా ఆసుపత్రి సందర్శించిన బిజెపి నేత బండారు దత్తాత్రేయ, రాజా సింగ్ ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిని గురించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుతం చాలా దయనీయ పరిస్థితిలో ఉందన్నారు బీజేపీ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. కొత్త బిల్డింగ్ కడుతామని 2010లో జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఉస్మానియ జనరల్ ఆస్పత్రిని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్ విజిట్ చేశారు. ఈ తర్వాత మాట్లాడిన దత్తాత్రేయ.. ఉస్మానియా ఆస్పత్రి పాత బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలియక డాక్టర్లు, పేషేంట్లు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. వెయ్యి కోట్లతో వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించడంతో పాటు..సరిపోను మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు. ఉస్మానియాను.. గాంధీ ఆస్పత్రి తరహాలో నిర్మిచాలని ఎన్నో సార్లు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 6వందల కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న కేసీఆర్ కు శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ఎందుకు కన్పించడం లేదని ప్రశ్నించారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి ముఖ్యంకానీ, అన్ని వసతులు ఉన్న భవనాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని కట్టాల్సిన అవసరం లేదని బిజెపి నేతలు అభిప్రాయ పడుతున్నారు. అటు బీజేపీ నేతలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఉస్మానియా ఆస్పత్రి విషయంలో కేసీఆర్ చొరవ చూపాలని, నూతన భవనాన్ని నిర్మించడం తో పాటుగా అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana State Health Status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *