సినిమాను ఆదుకునేవారిపై అభ్యంతరాలా..?

OTT or Theater?

సినిమా పరిశ్రమ మనుగడ ఆధారపడి ఉన్నదే నిర్మాతలపై. నిర్మాత సంతోషంగా లేకపోతే పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంలో పడుతుంది. అయితే ఒకప్పుడు నిర్మాత అంటే తను కొంత అమౌండ్ పెట్టి మిగతాది డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకుని అందరికీ ఆమోదమైన కథ, నటీనటులతోనే సినిమాలు తెరకెక్కించేవారు. అయితే అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా ఉండేది. కానీ రాన్రానూ ఆ వ్యవస్థ మారింది. ఇప్పుడు నిర్మాతే అంతా చూసుకుంటున్నాడు. ఫైనాన్సియర్స్ ఉన్నా.. వాళ్లు సినిమాలో జోక్యం చేసుకోరు. కేవలం వ్యాపారం మాత్రమే చూసుకుంటారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ముప్పుగా మారింది. ఆ కారణంగానే ఇప్పుడు వచ్చిన ఇంత పెద్ద సంక్షోభం నుంచి పరిశ్రమ కోలుకోవడం కష్టం అనే మాటలకు కారణమౌతోంది.
దాదాపు రెండు నెలలుగా ఇండస్ట్రీ మూతపడింది. షూటింగుల్లేవు.. థియేటర్స్ లేవు.

అంతా గప్ చుప్. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న అనేక సినిమాలు కూడా ఆగిపోయాయి. అంటే ఆ సినిమాల కోసం నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. అసలే సినిమా విడుదలై రిజల్ట్ వచ్చే వరకూ గ్యారెంటీ సినిమాలేని పరిశ్రమ కదా. అలాంటిది అసలు సినిమాలే లేకపోతే ఆ వడ్డీలు మరింత ఇబ్బంది పెడతాయి. పోనీ కొంత కాలం బేర్ చేద్దాం అనుకుంటే అది ఎంత కాలం అనేందుకు ఏ క్రైటీరియా కనిపించడం లేదు. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి.. అప్పుడు సినిమాలు విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది. ఆడియన్స్ సినిమాలు చూస్తారా లేదా అంటూ సవాలక్ష ప్రశ్నలూ ఉన్నాయి. అందువల్ల నిర్మాతలు ఇలా ఎంత కాలం సినిమాలు విడుదల కాక తెచ్చిన డబ్బలుకు అప్పులు కట్టాలి అనే ప్రశ్నలూ వస్తాయి. ఈ ప్రశ్నకు ఓ సమాధానం చెప్పేందుకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ సిద్ధంగా ఉన్నాయి.

కానీ ఓటిటిలో విడుదల చేయడాన్ని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ తప్పు బడుతున్నారు. ఇంకా కొంతమందైతే ఏకంగా బెదిరిస్తున్నారు కూడా. రాబోయే రోజుల్లో మీ సినిమాలు ఎలా విడుదల చేస్తారో చూస్తాం అనే రేంజ్ లో ఉంటున్నాయా బెదిరింపులు. మరి సినిమాపై ఏ రకమైన ఇది లేకుండా వాళ్లు ఇలా బెదిరించడం ఎంత వరకూ కరెక్ట్. పోనీ ఈ వ్యవస్థ అంతా కలిసి థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ ‘వడ్డీలు లేకుండా’చేయగలదా. ఈ మేరకు ఫైనార్సియర్స్ ను ఒప్పించగలరా.. అంటే వారికి ఆ అవసరం లేదు. మరి ఇలా నిర్మాతలకు కాస్తో కూస్తో లాభాలు తెచ్చే ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు విడుదల చేసుకుంటే వారికి వచ్చే ఇబ్బంది ఏంటీ..? అంటే ఇలా ప్రజలను ఓటిటికి అలవాటు చేస్తే రాబోయే రోజుల్లో థియేటర్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనేది వారి వాదన. ఆ వాదనలో కొంత నిజం ఉన్నా.. అది నిజంగా నిజం అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఏదో ఇప్పుడు అవకాశం లేక జనాలు థియేటర్స్ కు రావడం లేదు కానీ.. బుల్లితెరపై ఏ పెద్ద సినిమాలనూ జనం చూడరు అనేదీ నిజమే.

మొత్తంగా ఇప్పుడు చిన్న నిర్మాతలు కొంత వరకైనా బతికి బట్ట కట్టాలంటే ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ ను బట్టి ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అమ్మేసుకోవడమే బెటర్. ఈ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేనప్పుడు తను మాత్రమే ఎందుకు సఫర్ కావాలి. మరో విషయం ఏంటంటే.. ఈ విషయంలో హీరోలు కూడా నిర్మాతలకు సపోర్ట్ చేస్తేనే పరిశ్రమ మనుగడ ఉంటుంది. లేదంటే ఆ నిర్మాతలు తర్వాతి రోజుల్లో అయినా ఏకంగా వెబ్ సిరీస్ ల వైపు వెళతారు. అప్పుడు ఇంకా ప్రమాదం కదా. అందుకే చిన్న, మధ్య తరగతి సినిమాలను ఏదో ఒక రేట్ కు డిజిటల్ స్ట్రీమింగ్ లో పెట్టేయడమే ఉత్తమం. కనీసం ఆ నిర్మాతలైనా ఇబ్బంది లేకుండా ఉంటారు. ఒకవేళ ఈ సినిమాలకు ఓటిటిలో మంచి రేటింగ్ వస్తే ఆ తర్వాత మళ్లీ థియేటర్స్ కూడా మాగ్జిమం సందడి చేస్తాయి అని చెప్పొచ్చు.  అందువల్ల ఏదో రకంగా ఇప్పుడు సినిమాను ఆదుకుంటామని ముందుకు వస్తోన్న ఓటిటి యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం.. వారికి సినిమా అమ్మేస్తామని చెబుతోన్న నిర్మాతలను బెదిరించడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే అని చెప్పాలి.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *