పాక్ ఆర్మీ చీఫ్ కొత్త డ్రామా..

Pak Is Ready To Fight With India For Kashmir
జమ్మూ-కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ఇండియాపై మరోసారి ఏడ్చింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఇండియాపై పాకిస్థాన్ అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సహ మిగతా నేతలు ఇండియాకి వార్నింగులు మీద వార్నింగులు ఇచ్చేస్తున్నారు. అవసరమైతే అణుయుద్ధానికి కూడా సిద్ధమని  పెద్ద పెద్ద ప్రకటనలు చేసేస్తున్నారు. ఇక వీరికి మనోళ్ళు కూడా గట్టి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ భజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ హిందూత్వ బాధిత ప్రాంతమని వేధింపులు అక్కడ నిత్యం కృత్యం అయ్యాయని అన్నారు. ఇక కశ్మీరే పాకిస్తాన్ ఎజెండా అని, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుగా తీసుకుంటున్నామని , కశ్మీరీలను పాకిస్తాన్ ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టదని చెప్పారు. ఆఖరి సైనికుడి వరకు,చివరి బుల్లెట్ వరకు ,తుది శ్వాస వరకు తాము పోరాడతామని,ఎంత వరకైనా వెళ్లేందుకు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటన చేశారు. అయితే యుద్ధ మేఘాలు, ఉద్రిక్తతలు కమ్ముకుంటున్నప్పటికీ తాము శాంతినే కాంక్షిస్తున్నామని, కశ్మీరీలకు తాము ఉన్నామని, వారి కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధమంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. మొత్తానికి పాక్ ఆర్మీ చీఫ్ కశ్మీర్ కోసం భారత్ తో యుద్ధానికైనా సిద్ధమంటున్నారు. మరి ఈ పాక్ ఆర్మీ చీఫ్ కు మనోళ్ళు ఏం కౌంటర్ ఇస్తారో చూడాలి. కొద్ది రోజులుగా భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సరిహద్దల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతోన్న పాక్ మరోసారి అదే పంథాలో ముందుకు వెళుతున్నట్టు మరోసారి స్పష్టమైంది.

tags: pakistan, army chief, jammu kashmir, war, qumar javed bajwa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *