జైషే మహమ్మద్ తో పాటు ఇతర ఉగ్రసంస్థల సభ్యులను అరెస్ట్ చేసిన పాక్

Spread the love

PAKISTAN ARRESTED JAISH MUHAMMAD AND EMIGRANT TERRORISTS

ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ చేస్తున్న పోరాటంలో భాగంగా పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగు తోంది. భారత ఎఫెక్ట్ తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. జైషే మహ్మద్‌తో పాటు నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాద సంస్థలపై పాక్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. జైషే మహ్మద్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని తెలుస్తోంది. కాగా వారిని అదుపులోకి మాత్రమే తీసుకున్నారని కూడా వార్తలొస్తున్నాయి.

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ అలియా ముఫ్తీ అబ్దుర్ రవూఫ్‌ను కూడా పాకిస్తాన్ కస్టడీలోకి తీసుకుందని సమాచారం. జైషే మహ్మద్‌కు చెందిన హమ్మద్ అజహర్‌ను అరెస్ట్ చేశామని పాక్ మంత్రి షెహర్యార్ ఖాన్ అఫ్రిదీ మీడియా సమావేశంలో తెలిపారు. భారత్ లో పుల్వామా దాడులకు కారణమైన వారి పేర్లను గత వారం భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు అందజేసింది . భారత్ ఇచ్చిన జాబితాలో ముఫ్తీ అబ్దుర్ రవూఫ్, హమ్మద్ అజహర్‌ పేర్లు ఉన్నాయని పాక్ మంత్రి తెలిపారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల నుండి వస్తోన్న ఒత్తిడి మేరకే ఇలా చేస్తున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు లేదా సంస్థలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను అమలు చేయాలనే చట్టం సోమవారమే పాకిస్థాన్‌లో అమల్లోకి వచ్చింది. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.

అయితే పాకిస్తాన్ ప్రస్తుతం చేస్తున్న అరెస్టులు ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న కుట్రగా భారత్ దీనిని ఖండిస్తోంది.

Latest Interesting Telugu News Tsnews

For More New 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *