Pakistan PM got corona
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కరోనా సోకింది. ఆయన కరోనా వ్యాక్సీన్ వేసుకున్న రెండు రోజుల తర్వాత ఈ విషయం బయటికొచ్చింది. అయితే, తను చైనాకు చెందిన సినోఫార్మ్ కరోనా వైరస్ వ్యాక్సీన్ తీసుకున్నట్లు సమాచారం. ఆ దేశపు ఆరోగ్య శాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ ఈ వార్తను ధృవీకరించారు. తమ ప్రధానికి కరోనా సోకిందని, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.