PARIGI MLA INJURED IN A CAR ACCIDENT
శుక్రవారం రాత్రి చేవేళ్లలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. అందులోని ఎమ్మెల్యేకు గాయాలైనట్లు సమాచారం. హరీశ్వర్ రెడ్డి కుమారుడైన మహేశ్వర్ రెడ్డి కి గాయాలు కావడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులెంతో ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వాహనం చేవెళ్ల టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొని గాయాలు. Ts 34.B.4545 వాహనంలో హైదరాబాద్ నుండి వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ts 07 Fu 2347 ఢీ కొనడంతో గాయాలతో బయటపడ్డ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. ఆయన్ని హైదరాబాద్లోని ఒక హాస్పిటల్ కు తరలించారు.