అమెజాన్ లో పార్ట్ టైం జాబ్స్ .. ఎవరైనా ఓకే

Spread the love

Part Time Jobs In Amazon

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. అమెజాన్ నుంచి ప్రొడక్టులను ఎంతో మంది ఆర్డర్ చేస్తుంటారు. పీక్ సీజన్ సమయంలో ఆర్డర్లు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులకు సకాలంలో డెలివరీ చేయడం కాస్త కష్టంగా మారుతోంది. పీక్ సీజన్ లో ఐటమ్ డెలవరీ సమస్యను పరిష్కరించి వేగవంతంగా డెలివరీ చేసే దిశగా అమెజాన్ ఇండియా కొత్త పార్ట్ టైం జాబ్స్ సృష్టిస్తోంది. పార్ట్ టైం జాబ్స్ కు ఎవరైనా ఓకే అంటోంది.. సేఫ్ గా ఐటమ్ డెలివరీ చేస్తే చాలు అంటోంది.
పార్ట్ టైం డెలివరీ ఉద్యోగం కోసం ఎవరైనా అప్లయ్ చేయొచ్చు.ఈ పార్ట్ టైం జాబ్ ఆఫర్ ను ప్రత్యేకించి.. స్టూడెంట్స్, హోం మేకర్లు, రిటైర్డ్ ప్రొఫిషనల్స్ కు ఆఫర్ చేస్తోంది. కంపెనీలో ఫ్లెక్సీబల్ జాబ్స్ క్రియేట్ చేయాలని అమెజాన్ భావిస్తోంది. Amazon Flex పేరుతో కంపెనీ వేలాది మంది ఉద్యోగార్థులకు జాబ్ అవకాశాలను కల్పిస్తోంది. అంతేకాదు.. ఖాళీ సమయాల్లో పాకెట్ మనీ కోసం ప్రయత్నించే వారికి ఈ డెలివరీ జాబ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అమెజాన్ ఐటమ్స్ డెలివరీ చేసే వ్యక్తి రోజుకు 4 గంటల పాటు పని చేస్తే చాలు.. గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించుకోవచ్చు. డెలవరీ చేసే ఉద్యోగికి ప్రతి బుధవారం డెలివరీ పార్టనర్ వేతనాన్ని చెల్లించనుంది. ఇప్పటికే అమెజాన్ కంపెనీ ఓ పైలట్ ను కూడా రన్ చేస్తోంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో పైలట్ ను రెండు వారాల ముందే లాంచ్ చేసింది. ఈ ఏడాదిలో మరిన్ని నగరాలకు పైలట్ డెలివరీని విస్తరించేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తోంది.అమెజాన్ కంపెనీ Amazon Flex ను ప్రవేశపెట్టిన దేశాల్లో ఇండియా ఏడో దేశం. భారత్ తో పాటు ఉత్తర అమెరికా, జర్మనీ, స్పెయిన్, జపాన్, సింగపూర్, యూకే దేశాల్లో కూడా ఈ సర్వీసు రన్ చేస్తోంది. ఆర్డర్ చేసిన కస్టమర్లకు వేగవంతంగా ఐటమ్ డెలివరీ చేసేందుకు ఈ సర్వీసు ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఆసియా కస్టమర్ ఫుల్ ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు.
అమెజాన్ ఇండియా ఇటీవల One-day, Two-day తో పాటు షెడ్యూల్డ్ డెలివరీలను లాంచ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ ఆఫర్లులో మాత్రం తర్వాతి రోజున డెలివరీ చేస్తోంది. Prime Now ఆఫర్లతో రెండెన్నర గంటల్లో డెలివరీ చేస్తోంది. 2013లో ఇండియాలో అమెజాన్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ 4లక్షల సెల్లర్ల నుంచి 170 మిలియన్ల ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. ఇండియాలో అమెజాన్ ఆరంభంలో కంట్రీ యూనిట్ కింద 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *