కరోనా టైమ్లో పార్టీ చేసుకోండిలా

party during corona time

ప్రపంచమంతా లాక్ డౌన్ అయ్యింది. భారతదేశంలో ఎవరూ బయటికి రావడం లేదు. కేసీఆర్ సార్ మాట విని దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. బ‌య‌టికి ఎవ‌రైనా ఎక్కువ‌గా వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తే షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్ కూడా ఇస్తాన‌ని అన్నారు. మ‌రి, ఆ ప‌రిస్థితి తెచ్చుకోకుండా బుద్ధిగా ఇంట్లో ఉంటూనే.. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఫ్రెండ్స్ తో క‌ల‌సి స‌ర‌దాగా పార్టీ చేసుకోవచ్చు.
చ్చా? పార్టీ అంటే అదేదో మందు పార్టీ అనుకునేరు. మేం చెప్పేది కాస్త విభిన్నమైన పార్టీ గురించి. వింటుంటే ఇదేదో విడ్డూరంగా అనిపిస్తుందే.. అని అంటారా? ఆగండాగండి మేం చెప్పేది కాస్త ఓపికగా వినండి. మేం చెబుతున్నది లైవ్ పార్టీల గురించి కాదండి.. ఆన్ లైన్ పార్టీ ల గురించి. అదెలాగంటే… ఆన్ లైన్లో ఫ్రెండ్స్ తో కలిసి మీరు వర్చూవల్ గా నచ్చిన సినిమా చూడొచ్చు. కావాలంటే నచ్చిన మ్యూజియంను వీక్షించొచ్చు. ఇలాంటి సేవల్ని అందించడానికి ఐదు మొబైల్ యాప్ లు సిద్ధంగా ఉన్నాయి తెలుసా?

ప్రస్తుతం భారతదేశం 21 రోజులు లాక్ డౌన్లో ఉంది. ప్రతిఒక్కరినీ ఇంట్లోనే ఉండమని పీఎం మోడీ అన్నారు. అయిన‌ప్ప‌టికీ, ఎంచ‌క్కా మీరు ఆన్ లైన్ ద్వారా స్నేహితులతో కలిసి సరదాగా సోషలైజ్ కావొచ్చు. ఈ వారం చాలామంది వర్చూవల్ ట్రిప్ ద్వారా తాజ్ మహల్ వెళ్లారనే సంగతి తెలుసా? ఇందుకోసం గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ని వినియోగించారు. బాబల్ ద్వారా కొత్త భాష చాలా మంది నేర్చుకుంటున్నారు తెలుసా? ఇందుకోసం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. మ‌రి, ప్ర‌పంచ భాష‌ల‌ను నేర్చుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు ఈ మాత్రం ఖ‌ర్చుకు వెనుకాడ‌క‌పోతేనే మంచిది. మ‌రి,
కొన్ని యాపుల‌ గురించి తెలుసుకుంటే, ఇలాంటి పనులెన్నో మ‌నం ఇంట్లోనే ఉండి చేసేయ‌వ‌చ్చు.

నెట్ ఫ్లిక్స్ పార్టీ
ఇది నెట్ ఫ్లిక్స్ కి కొనసాగింపు అని చెప్పొచ్చు. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో నెట్ ఫ్లిక్స్ గురించి తెలియని వారెవ్వరైనా ఉంటారా? 2015లో అందుబాటులోకి వచ్చిన నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ స్థాయిలో డౌన్ లోడ్లు పెరుగుతున్నాయి. అయితే, మీరు గూగుల్ క్రోమ్ ని ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. మీరు స్నేహితులతో కలిసి వర్చూవల్ మూవీని చూడొచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా.. నెట్ ఫ్లిక్స్ ట్రయల్ సైనప్ చేయాలి. నెల రోజుల్లోపు ఇది ఉచితంగానే ఉంటుంది. ఆ త‌ర్వాత నెల‌కు కొంత రుసుము క‌ట్టాల్సి ఉంటుంది.

హౌజ్ పార్టీ
మీరు స్నేహితులతో కలిసి గేమ్స్ ఆడుతూ వీడియో చాట్ చేయాలనుకుంటే.. ట్రివియా మీకు హెల్ప్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ ను ఇరవై లక్షల సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. యాపిల్, ఆండ్రాయిడ్ లో ఇదే హాట్ యాప్ అని చెప్పొచ్చు. ఎపిక్ గేమ్స్ సంస్థ హౌజ్ పార్టీని డెవలప్ చేసింది. ఫోర్ట్ నైట్ అనే ఆన్ లైన్ వీడియో గేమ్ ను కూడా ఇదే సంస్థ డెవలప్ చేసిందనే విషయాన్ని గుర్తుంచుకోండి.

గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రాజెక్టు
ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యూజియంల చుట్టూ మీరు తిరగాలని అనుకుంటున్నారా? ప్రపంచంలోని బెస్ట్ ఒపెరా హౌజెస్ లేదా ఈజిప్ట్ పిరమిడ్లు చూడాలని భావిస్తున్నారా? అయితే, ఇందుకోసం మీకు హెల్ప్ చేస్తుంది గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రాజెక్టు. ఇందులో సుమారు 1200 మ్యూజియంలకు సంబంధించిన సమాచారం ఉంది. ఆరు వందల ఆర్టిస్టుల చిత్రకళలున్నాయి. ఇందులోని ఇండోర్ టెక్నాలజీ సాయంతో 360 డిగ్రీల్లో ఇండివిడ్యువల్ గ్యాలరీలను చూడొచ్చు. అరవై మ్యూజియంల వీధులను కవర్ చేసి పెట్టారు.

ఈవెంట్ బ్రైట్..
ఈవెంట్ బ్రైట్ ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణంగా కంపెనీలు నిర్వహించే ఈవెంట్లను ఇందులో చూడొచ్చు. కాకపోతే, ఇప్పుడు ప్రపంచమే లాక్ డౌన్ అయ్యింది కాబట్టి, దీని ద్వారా ప్రస్తుతం వర్చూవల్ ఈవెంట్లను చూడొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ, కల్చర్ ఈవెంట్లను ఎప్పుడంటే అప్పుడు చూసే వీలును కల్పించారు.. కాకపోతే, జూమ్ ని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇన్ స్టా గ్రామ్ కో-వాచింగ్
ఇన్ స్టాగ్రామ్ వాడనివారు చాలా తక్కువమంది ఉంటారు. వాస్తవానికి, సెలబ్రిటీలు కూడా ఎక్కువగా ఇన్ స్టాలోకి విచ్చేస్తున్నారు. అందుకే, ఈ సంస్థ ఏం చేసిందంటే, తాజాగా స్నేహితులతో వీడియో కాల్ ద్వారా పోస్టులను చూసుకుంటూ మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పించింది. ఫేస్ బుక్ వాచ్ లో మీ ఫ్రెండ్స్ కేవలం టెక్స్ట్ లేదా ఇమోజీ సాయంతో మీ వీడియోల మీద రియాక్ట్ అవ్వొచ్చు కానీ వీడియో కాల్ మాట్లాడలేరు. ఇన్ స్టా గ్రామ్లో మాత్రం ఎంచక్కా మెసేజింగ్ ట్యాబింగ్ ద్వారానే ఫ్రెండ్స్ తో కలిసి వీడియో కాల్ కూడా చేసేయవచ్చు. మరెందుకు ఆలస్యం.. వెంటనే ఇన్ స్టా నుంచి మీ ఫ్రెండ్స్ తో వీడియో కాల్ స్టార్ట్ చేసేయండి మరీ..

#houseparty,#googleartandcultureproject,#eventbright,#instagram cowatching

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *