నా బాస్ తో మూడోసారి

Pavan, Bandla ganesh New movie Confirm

పవన కల్యాన్ డైహర్ట్ ఫ్యాన్స్ లో బండ్ల గణేశ్ ఎప్పుడూ ముందుంటారు. పవన్ ను కలిసేందుకు చిన్న అవకాశం దొరికినా వదులుకోడు. సోషల్ మీడియాలో, బయట వేదికలపై పవన్ పై ప్రేమను చాటుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ’నా దేవుడు పవన్‘ అని అంటాడు. పవన్ కూడా బండ్లకు డేట్స్ ఇచ్చి ప్రోత్సహిస్తుంటాడు. గతంలో వీరి కలయికలో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు వచ్చాయి. గబ్బర్ సింగ్ మాత్రం ఇండస్ర్టీ టాక్ గా నిలిచింది. దీంతో వీరి కాంబినేషన్ అంటేనే సహజంగానే అంచనాలు ఉంటాయి.

తాజాగా బండ్లగణేశ్‌ ముచ్చటగా మూడోసారి పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని బండ్లగణేశ్‌ సోషల్‌ మీడియా ద్వారా బయట పెట్టాడు. “నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు” అని మెసేజ్‌తో పాటు పవన్‌కల్యాణ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత బండ్లగణేశ్‌ నిర్మిస్తున్న చిత్రం ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *