పవన్ – క్రిష్ సినిమా టైటిల్ ఇదే…?

3
Pavan Kalyan new movie title
Pavan Kalyan new movie title

Pavan Kalyan new movie title

వకీల్ సాబ్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నానుడు పవన్ కళ్యాణ్.  ఆ తదుపరి సినిమా డైరెక్టర్ క్రిష్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఇటీవల ఆ సినిమా గురించి ప్రకటన వచ్చింది. మొగల్ పరిపాలనా కాలానికి చెందిన ఈ కథలో పవన్ ఓ గజదొంగగా నటించబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమాకు `విరూపాక్ష`, `గజదొంగ` అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా  మరో పేరు వినిపిస్తోంది. `ఓం శివమ్` అనే టైటిల్ పెట్టబోతున్నట్టు లేటెస్ట్ టాక్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూడు టైటిల్స్ లో ఏదీ ఖారరు అవుతుందో చూడాలి మరి.