యూరియా కోసం రైతు మృతి ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

Pavan Unhappy For Farmer Died For USREA

తెలంగాణలో యూరియా కోసం రైతు చనిపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతున్నాయి. ఇక ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రైతు మరణంపై విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దిండిలో జనసేన పార్టీ మేథోమథన సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ యూరియా కోసం రైతు మరణించిన వార్తపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతు మరణించిన ఘటనపై బాధ్యతాయుత పదవిలో ఉన్నవారు సరైన రీతిలో స్పందించాలని కోరారు. రైతుల డిమాండ్‌కు తగిన విధంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. యూరియా కోసం క్యూలో గంటల తరబడి నిలబడి గుండెపోటుతో చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం రైతాంగానికి అవసరమైన ఎరువులు యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Raj Sing Fires on Promoting in Yadadri Pillars

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *