ఢిల్లీ టూర్ లో ఉన్న పవన్ జగన్ గురించి ఏం చెప్పారంటే

PAWAN HOT COMMENTS ON CM JAGAN

ఢిల్లీ టూర్ లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లిన కారణమేంటో ఇప్పటి వరకు ఎవరికీ అంతుపట్టలేదు. ఉన్నట్టుండి ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఎవరెవరితో భేటీ కానున్నారు? అన్న విషయాల మీద క్లారిటీ ఇవ్వని జనసేనాని తాజాగా ట్విట్టర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్య పోస్టు పెట్టారు. కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకున్న జగన్ ఫోటోను ఆయన పోస్టు చేశారు. సీఎం జగన్ పై జాతీయ పత్రికల్లో వేసిన కార్టూన్ అని.. ఏపీ సీఎం గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉందన్న వ్యాఖ్య చేశారు. జగన్ క్యారికేచర్ తో వ్యంగ్య ఫోటోను పోస్టు చేసిన పవన్.. వ్యంగ్య చిత్రంతో పాటు.. ఆయనో వ్యాఖ్యను పోస్టు చేశారు. ‘‘ఏపీలో మొత్తం175 అసెంబ్లీ స్థానాలు ఉంటే 151 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బ తింది. 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది’’ అంటూ మండిపడ్డారు.

tags : andhra pradesh, pawan kalyan, jagan mohan reddy, delhi tour, amith shah, jp nadda, bjp, janasena, twitter, post

లోకేష్, చంద్రబాబు పై వంశీ తిట్లు

ప్రజలను మోసం చేయడంలో కెసిఆర్ దిట్ట అన్న డీకే అరుణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *