ఆ మళయాల రీమేక్ లో పవన్ కళ్యాణ్..?

Pawan in malayala remake?

ఈ మధ్య మాలీవుడ్ సినిమాలు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. సాధారణమైన కథలుగా అసాధారణమైన ఇంపాక్ట్ చూపించడంలో దేశంలో మళయాలీల తర్వాతే ఎవరైనా. కొన్నాళ్ల క్రితం వారి సినిమాలు చాలా స్లోగా ఉంటాయి అనే పేరుంది. అయితే ఇప్పుడు మారారు. వాళ్లు కూడా రేసీ మూవీస్ తో ఆకట్టుకుంటున్నారు. లేదంటే స్క్రీన్ ప్లే లో కాస్త వేగం పెంచారు. అందుకే మన స్టార్ హీరోలు కూడా అక్కడి సినిమాలను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మళయాలంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఈ మధ్య అన్ని భాషల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న ‘ఏకె అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్ర రీమేక్ రైట్స్ ను మనవాళ్లు కొనేశారు. వీటిలో ముఖ్యంగా అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ దక్కించుకుంది. అప్పటి నుంచి వారి వద్ద నుంచి ఆ సినిమా కోసం చాలామంది ప్రయత్నించారు.

ఈ క్రమంలో సురేష్ బాబు కూడా సితారతో చేతులు కలిపాడు. ఇక సినిమాలోని ఓ ప్రధాన పాత్రను రానా చేసేందుకు ఓకే చెప్పాడు. అందులోని పోలీస్ ఇన్స్ పెక్టర్ క్యారెక్టర్ ను బాలకృష్ణతో చేయించాలని ఆయనకు ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్ లో షో కూడా వేశారు. కానీ ఇందులో తన మార్క్ మాస్ మసాలా లేదని నో చెప్పాడు బాలయ్య. ఇక ఇదే చిత్రాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ కు చూపించారు. ఆయన ఈ సినిమా పవన్ కు బాగా నచ్చిందని టాక్. అన్నీ కుదిరితే ఇందులోని పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అతను ఆల్రెడీ ఓకే చెప్పిన  క్రిష్ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టేస్తారు. అయితే పవన్ ఈ సినిమా చేస్తాడా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ పవన్ ఓకే అంటే దర్శకుడు కూడా సిద్ధంగానే ఉన్నట్టు టాక్.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *