జనసైనికుల వల్లే ఓడిపొయ్యాను

Pawan Kalyan Fires on Janasena Leaders

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. వైస్ జగన్ ఢిల్లీ టూర్లు వేస్తుండగా, పవన్ కళ్యాణ్ ఏపీలో విస్తృత పర్యటనలు చేస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాడు. సీఎం జగన్ వైఖరిని తప్పుబడుతూ పలు కామెంట్స్ చేస్తున్నారు జనసేనాని. అయితే నేడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని మండపేటలో రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన రైతుల గురించి మాట్లాడుతుండగా జనసైనికులు విజిల్స్, విచక్షణ కోల్పోయి పవర్ స్టార్ అంటూ నినాదాలతో ఆ సదస్సుని అల్లరిపాలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సైనికులపై మండిపడుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమికి మీ ప్రవర్తనే కారణమంటూ మండిపడ్డాడు పవన్. జనసేన సైనికులకు కనీస క్రమశిక్షణ లేదని కుండబద్దలు కొట్టాడు పవన్. జనసైనికులకు కొంచెం కూడా మర్యాద లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక జనసేనాని షాకింగ్ కామెంట్స్ కు సైనికులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా మారిపోయింది.

Pawan Kalyan Fires on Janasena Leaders,Rajamandri,Mandapeta Raitu Sadassu,Pawan Meeting With Mandapeta Farmers,Janasena,Janasainukulu,Andhra News,Pawan Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *