రైతుల కోసం జగన్ కు అల్టిమేటం ఇచ్చిన  పవన్ కళ్యాణ్

Pawan Kalyan Hot Comments On CM Jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రైతు సమస్యల పరిష్కారం కోసం జగన్ కు అల్టిమేటం ఇచ్చారు. నేడు రైతు సమస్యలపై వైసిపి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మండపేటలో జనసేన రైతు సదస్సులో పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు.పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే రైతుల కడుపు నిండదని ఆయన ఎద్దేవా చేశారు. రక్తమాంసాలు ధారపోసి రైతులు అహర్నిశలు కృషి చేసి  పంటలు పండిస్తే  గిట్టుబాటు ధరలు ఇవ్వడంలేదని  జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రైతులకు భరోసా ఇవ్వాలని, రైతులను బ్రతికించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పవన్. అంతేకాదు రైతుల సమస్యల కోసం తాను రాజీలేని పోరాటం చేస్తానని చెప్పిన పవన్ అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై మాట్లాడాలని గుర్తు చేశారు.

అసెంబ్లీ మొదటి మూడు రోజుల్లో రైతు సమస్యలను పరిష్కరించకపోతే కాకినాడలో నిరాహారదీక్ష చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను అందించాలని డిమాండ్ తో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏ విషయం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వేలకోట్ల ఆస్తులు, సొంత ఇళ్ళు ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వ నిధులకోసం ఆశపడుతున్నారని  పవన్ పేర్కొన్నారు. ముద్దులు పెడితే ఆకలి తీరదని చురకలంటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనుకబడినవారికి, రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పవన్ తెలిపారు. మొత్తానికి  రైతు సమస్యలు పరిష్కరించకుంటే, అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ జరగకుంటే పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి వైసిపి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *