రైతు సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పవన్

Pawan Kalyan Interacts With Velagathodu Farmers

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మధురపూడి విమానాశ్రయం నుండి కడియం, కడియం సావరం జేగురుపాడు మీదుగా మండపేట నియోజకవర్గ పరిధిలోని మెర్నిపాడు చేరుకున్నారు. రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు రైతు సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్ వైఖరిని తప్పుబడుతూ పలు కామెంట్స్ చేశారు. రైతుల పట్ల సానుభూతి లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పలు రైతులను పిలిచి ఒక్కొక్కరితో మాట్లాడి సమస్యలేంటో తెలుసుకుని పరిష్కరిస్తానన్నారు. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దూకుడు పెంచి ప్రజలతో మమేకమై ఉంటున్నారు, అయితే రాజకీయనాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా ప్రజల సమస్యలపై ఇలానే పోరాడితే బాగుంటుందని స్థానికులు చెప్తున్న మాట.

Pawan Kalyan Interacts With Velagathodu Farmers,Mandapeta,Farmers Meet,Janasena Leader,Pawan Kalyan,CM Jagan,Pawan Fires On Jagan,#AP Political News,#Tsnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *