జగనన్న ఉల్లిపాయ పథకం పెట్టండి.. పవన్ సెటైర్లు

Pawan kalyan satires On CM Jagan

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉల్లి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఉల్లి ధరలను నియంత్రించడంలో ఫెయిలయ్యారు అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కానీ జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చేయదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన పవన్ కళ్యాణ్ ఆకాశాన్నంటిన ఉల్లి ధరలతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కిలో రూ.25కి ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. వీటి కోసం జనాలు పెద్దపెద్ద క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. సమ్మిరెడ్డి అనే వ్యక్తి క్యూలైన్లో నిలబడి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అనుభవ రాహిత్యమే ఈ సంక్షోభానికి కారణమని చెప్పారు.ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. ఉల్లి సరఫరా కోసం గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ప్రజల ఇళ్ల దగ్గరికే రూ. 25కి ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయడం లేదని అన్నారు. అవసరమైతే దీనికి ‘జగనన్న ఉల్లిపాయ పథకం’ అనే పేరు పెట్టుకోండని ఎద్దేవా చేశారు.మత మార్పిళ్లు, కూల్చివేతలు, కాంట్రాక్టు రద్దుల మీద పెట్టిన దృష్టిని వైసీపీ ప్రభుత్వం ప్రజల అవసరాల మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

tags : Jagan, Pawan Kalyan, AP, AP Government, YCP, Janasena Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *