తల తెగినా సరే పోరాడుతానంటున్న పవన్

Pawan Kalyan Strong Ultimatum
జనసేత అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ప్రజలకేదైనా సమస్య వస్తే తన సమస్యలా ఫీలవుతారు. అందుకే, నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తారు. నల్లమలలో యురేనియం కోసం ఒక్క చెట్టు కూడా నరకడానికి వీల్లేదంటూ హెచ్చరించారు. తన తల తెగినా సరే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. యురేనియం కోసం నల్లమల్లపై ఎక్కుపెట్టిన తపాకీ దించేవరకూ పోరాడతానని అన్నారు. దీనికి తన వంతుగా ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అవసరమైతే సైనికుడిగా అఖిలపక్షంతో కలిసి పోరాటంలో పాల్గొంటానని అన్నారు. ఓ చెంచు యువకుడైన శివ తన వద్దకొచ్చి నల్లమల్లలో యురేనియం తవ్వకాల గురించి చెప్పుకుని ఏడ్చారని.. దీంతో తనను తీవ్రంగా బాధ కలిగిందన్నారు. ఇది ఇలా ఉండగా.. సేవ్ నల్లమల ఉద్యమాన్ని చిన్నది చేసేలా, తప్పుదారి పట్టించేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు వ్యవహరిస్తున్నారని అఖిలపక్షం ఆరోపించింది. యురేనియం తవ్వకాలను అనుమతించమని శాసనసభ, మండలిలో చేసిన తీర్మానంతో కలిగే ప్రయోజనమేమీ లేదని అఖిలపక్షం నాయకులు అభిప్రాయపడ్డారు. యురేనియం తవ్వకాలు, అన్వేషణకు 2016లో రాష్ట్ర అటవీ సలహా మండలి ఇచ్చిన అనుమతులు, చేసిన తీర్మానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Uranium Mining Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *