పవన్ కళ్యాణ్ యూ టర్న్

PAWAN KALYAN SUPPORTS TDP

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది, ఎన్నికల ముందు వరకు టిడిపి పైన నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూ టర్న్ తీసుకొని చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. జగన్ పైన సమరం చేయడానికి చంద్రబాబుతో కలిసి సాగానున్నారా అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ లో ఇసుక కొరత విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ఇసుక విధానం లో తీసుకొచ్చిన మార్పు వలన 50 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రజలని చంపేస్తుంటే మేం ,మౌనంగా ఉండాలా? 151 సీట్లు ఇచ్చినందుకు ఇలా చేస్తారా? కొత్త ఇసుక పాలసీ తో ఇబ్బందులు పెడతారా? వైసీపీ నాయకులూ భోజనం లేకుండా వుండగలరా? అని ఘాటుగా ప్రశ్నించారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం లో వున్నపుడు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపిన జగన్ ఇపుడు చంద్రబాబు పై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక నిన్న చంద్రబాబు నాయుడు సాగించిన ఈ దీక్షకు సైతం జనసేన అధినేత మద్దతు తెలపడం జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ చంద్రబాబు దీక్షలో పాల్గొనడం , ఏపీ సర్కార్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం వంటి అంశాలు పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నాడనే ప్రచారానికి కారణమవుతున్నాయి.

tags : pawan kalyan, andhra pradesh, chandrababu, tdp, janasena, nadendla manohar, support tdp

దోస్త్ కటీఫ్ అంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

టీడీపీ నేతను బండ బూతులు తిట్టిన వల్లభనేని వంశీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *