భాష లేనిదే తెలంగాణ ఉద్యమం జరిగిందా… పవన్ కళ్యాణ్

Pawan Kalyan Telugu Medium Schools

తెలుగు భాష ప్రాధాన్యత పై మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మాతృ భాష తెలుగుకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సూచించారు. తెలుగు లేకుండా తెలంగాణ ఉద్యమం ముందుకెళ్లేదా? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపి ముందుకు తీసుకువెళ్ళి భాష మాత్రమే అని చెప్పారు. తెలుగు బాష లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదని, తెలంగాణ రాష్ట్ర సహకారము లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏపీని పాలిస్తున్న పాలకవర్గం కూడా ఆలోచించాలని సూచించారు. నాగరికతకు అమ్మ ఒడి నుడి అని చెప్పారు. భాష లేనిదే సంస్కృతి లేదని అన్నారు. మాతృ భాష గతిస్తే సంస్కృతి మిగలదని… దీనికి చరిత్రలో ఎన్నో రుజువులు ఉన్నాయని ట్వీట్ చేశారు. ఏపీలో తెలుగు మీడియం తీసి వేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం మంచి నిర్ణయం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మాతృ భాషను మృతభాషగా మార్చకండి అని ఆయన సూచించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని పాడవలసిన చోట తెలుగు తల్లికి అవమానం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను తెలుగు మీడియం తీసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర సాకారానికి భాష ఎంతగా దోహదం చేసిందో తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

tags: pawan kalyan, janasena party, telugu medium schools, telugu language, telangana movement, telangana new state, ap  cm jagan

చాలా రోజుల తర్వాత మహిళా సదస్సులో పాల్గొన్న కవిత..

సమ్మె విరమణ పై ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య విభేదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *