రేపు కాకినాడకు పవన్ ..రీజన్ ఇదే

Pawan Kalyan to Visit Kakinada Tomorrow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ పై చేసిన అసభ్య వ్యాఖ్యల నేపధ్యంలో  ఆయన ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించిన పవన్ పార్టీ కార్యకర్తలను , ద్వారంపూడి అనుచరులు దాడి చేసి గాయపరిచారు. అక్కడ జరిగిన రాళ్ళ దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ ఆరా తీయనున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  చంద్రబాబు, పవన్ లపై బండ బూతులు మాట్లాడారు. రాయలేని భాషలో ఆయన చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు మండిపడ్డారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్.. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వారంపూడి వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి ర్యాలీగా ద్వారంపూడి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, ద్వారంపూడి అనుయాయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ద్వారంపూడి వర్గం రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి.
తమ నాయకులను వైసీపీ నేతలు వెంటాడి మరీ కొట్టారని.. ఇదంతా పోలీసుల ఎదుటే జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. జనసేన నేతలపై పోలీసులు కేసులు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. 307 వంటి హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెడితే.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి తేల్చుకుంటానని పవన్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. 307 మినహా మిగిలిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జనసేనాని స్పందన కోసం నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఘర్షణ అనంతరం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత పూచికత్తుపై కొంతమందిని విడుదల చేశారు. ఇక ఈ నేపధ్యంలో రేపు పవన్ పర్యటన నేపధ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేప
ట్టారు.
Pawan Kalyan to Visit Kakinada Tomorrow,andhra pradesh, pawan kalyan, janasena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *