అల్లు అర్జున్ తో పాయల్ రాజ్ పుత్

payal with bunny

ఒకే సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100లో అమ్మడు అద్భుతంగా నటించినా.. తన సోయగాలకే ప్రేక్షకులు ఎక్కువగా పడిపోయారు. ఇలాంటి లేడీస్ కు ప్రతినిధిలా ఆ పాత్రలో నటించింది పాయల్. ఆర్ఎక్స్ 100 తర్వాత అమ్మడు ఎక్కడికో వెళుతుందనుకున్నారు. కానీ ఎక్కడికీ వెళ్లలేదు. కారణం.. ఈ మూవీ ఇచ్చిన ఇమేజ్ వల్ల అంతా ఆమెను అలాంటి పాత్రలతోనే అప్రోచ్ అయ్యారు. పైగా వెంటనే ఆర్డీఎక్స్ అనే మరో సినిమాతో మరింతగా రెచ్చిపోయింది. దీంతో ఇక తను రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు పనిచేయదు అనుకున్నారు. మరోవైపు డిస్కోరాజా, వెంకీమామ సినిమాల్లోని పాత్రలు కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అమ్మడికి హీరోయిన్ గా పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు. ఇక త్వరలోనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో రాబోతోన్న పాయల్ కు లేటెస్ట్ గా అల్లు అర్జున్ సరసన బంపర్ ఆఫర్ వచ్చిందంటున్నారు.

బన్నీతో రొమాన్స్ అంటే చిన్న విషయం కాదు కదా.. అయితే ఇది హీరోయిన్ పాత్ర కాదు. ఐటమ్ గాళ్ గానట. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘పుష్ప’ చిత్రంలోని ఓ హాట్ హాట్ ఐటమ్ సాంగ్ కోసం పాయల్ ను సంప్రదించారని తెలుస్తోంది. ఆల్రెడీ పాయల్ కూడా గతంలో తేజ డైరెక్షన్ లో వచ్చిన సీత చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. పైగా అందాలారబోతలో హద్దులు కూడా ఉండవు. అందుకే అమ్మడైతే ఈ పాటకు మరింత కిక్ వస్తుందనుకుంటున్నారట. ఇక సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆర్య లోని అ అంటే అమలా పురం నుంచి రీసెంట్ గా వచ్చిన రంగస్థలంలోని జిగేల్ రాణి వరకూ అన్ని ఐటమ్ సాంగ్సూ హాట్ హాట్ గా అద్దిరిపోతాయనే చెప్పాలి. ఓ రకంగా ఇది పాయల్ కు బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. కాకపోతే ఈ వార్తలో నిజమెంత అనేది తేలాల్సి ఉంది. నిజమే అయితే మాత్రం ఆర్ఎక్స్ 100 – ఆర్డీఎక్స్ ను మిక్స్ చేసి మరీ సుకుమార్ ఓ కొత్త పాయల్ ను ప్రేక్షకులకు చూపిస్తాడనే చెప్పాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *