People Worry About KCR
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ఆరోగ్యంపై ఎంతో ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల పట్ల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కేసీఆర్ కు కరోనా వచ్చిందని కొందరు పని గట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఆయన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీఏమైనప్పటికీ, గత పది రోజుల్నుంచి ఆయన మీడియాలో కానీ సమావేశంలో కానీ పాల్గొనలేదు. అయితే, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను చూసి తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ, అనారోగ్యంతో ఉంటే గనక అతిత్వరలో కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెడుతున్నారు. అందుకే, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.