సినిమా షూటింగ్స్ కు పర్మిషన్ వచ్చింది 

permission for shootings
షూటింగ్.. ఈ మాట వింటే సినిమా వారికైనా సీరియల్స్ వారికైనా ప్రాణం లేచి వస్తుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకూ షూటింగ్ పేరుతో సాగే హడావిడీ మామూలుగా ఉందడు. ఎన్నో క్రియేటివ్ మైండ్స్ మెంటల్ గా మరెంతో మంది ఫిజికల్ గా స్ట్రెయిన్ అవుతూ షూటింగ్ కోసం పడే ప్రయాసే మనకు ఓ మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. అందుకోసమే వారు ఎన్నో చేస్తుంటారు. కానీ కరోనా వల్ల మొదలైన లాక్ డౌన్ కారణంగా అన్ని షూటింగ్స్ బంద్ అయ్యాయి. దీంతో వేలాది కార్మికులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా పనిలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో సినిమా, టివి సీరియల్స్ షూటింగ్ కు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆశ్చర్యం ఏంటంటే.. ఈ షూటింగ్స్ కు ఎలాంటి రుసుమూ చెల్లించక్కర్లేదు. కేవలం ఆ రాష్ట్రంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆ జీవోలో పేర్కొన్నారు. అంటే షూటింగ్ లు అన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా చేసుకోవచ్చన్నమాట.
అయితే షూటింగ్ లు జరిపే ప్రాంతాలను బట్టి.. ఆ నిర్మాణ సంస్థ అక్కడి కన్సర్న్ డ్ అధికారికి కొంత మొత్తం(ఏరియాల వారీగా ఎంత అనేది జీవోలో పేర్కొన్నారు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే అర్బన్, రూరల్, మున్సిపాలిటీ ప్రాంతాలను బట్టి 10 -15వేల రూపాయలు సంబంధిత అధికారికి చెల్లించాలి. షూటింగ్ పూర్తయిన తర్వాతమళ్లీ ఆ మొత్తాన్ని తిరిగి నిర్మాణ సంస్థకే చెల్లిస్తారు. అంతే కాదు.. ఇప్పటి వరకూ ప్రొడక్షన్ మేనేజర్లు చేసినట్టుగా.. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి లొకేషన్ కావాలని ముందుగా తెలియజేస్తే అవసరమైన లొకేషన్స్ ను కూడా ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మరీ చూపిస్తారట. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ అదిరిపోయిందనే చెప్పాలి. అసలే షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతూ.. ఎలాగైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడి చిత్రీకరణ చేయాలనుకున్న ఎంతోమంది దర్శక, నిర్మాతలకు సాయం చేస్తూనే.. రాబోయే రోజుల్లో అక్కడ మరో కొత్త పరిశ్రమకు ఆస్కారం కల్పించే విధంగా ఈ నిర్ణయం నాంది కాబోతోంది అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *