ఆర్టీసీలో ప్రైవేటీకరణపై పిటీషన్ 

Petition on privatization in RTC

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 35 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాకుండా సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ 5,300 రూట్లను ప్రైవేటు ట్రావెల్స్ కు అప్పగించారు. ఇక అంతే కాదు ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించకుంటే మిగతా ఐదు వేల రూట్లను సైతం ప్రైవేటీకరణ చేస్తానని హెచ్చరించారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంపై హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. 5300 రూట్ల ప్రైవేటీకరణపై ప్రొ.విశ్వేశ్వరరావు అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్‌పై విచారణ జరిగింది. తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు నిలిపివేయాలని పిటిషన్‌‌లో విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ వాదనను కోర్టు క్యాబినెట్ ప్రెసిడెంట్ను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతే కాకుండా ఆర్ టి సి కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ప్రైవేట్ గడ్డపై సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

tags : tsrtc strike, rtc workers, cm kcr, cabinet decision, privatisation, rtc routes, high court , government

ప్రభుత్వ అధికారులపై చీటింగ్ కేసు పెట్టాలన్న షబ్బీర్ అలీ

http://tsnews.tv/ttd-increase-rental-room-rates/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *