ఆర్టీసీ సంస్థకు షాక్ ఇచ్చిన పీఎఫ్ ఆఫీస్ 

PF office which gave shock to RTC

కార్మికుల సమ్మెతో సతమతమవుతున్న టీఎస్ ఆర్టీసీ సంస్థ యాజమాన్యానికి ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయం షాక్ ఇచ్చింది. కార్మికుల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మకు నోటీసులు జారీచేశారు. ఎప్పటికప్పుడు కార్మికుల ఖాతాల్లో జమకావాల్సిన పీఎఫ్ జమ కాలేదని, ఆ మొత్తం ఇప్పుడు రూ.760 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ నెల 15లోగా పూర్తి సమాచారంతో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టీసీ సంస్థ, రవాణా శాఖకు కూడా బకాయిలు పడింది. పన్ను బకాయిలు చెల్లించాలని ఆ శాఖ ఆర్టీసీకి ఇప్పటికే నోటీసులు పంపింది. అసలే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో గందరగోళంగా ఉన్న ఆర్టీసీ కార్పోరేషన్ పరిస్థితి  మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తయారైంది. ఆర్టీసీ యాజమాన్యానికి ప్రావిడెంట్ ఫండ్ నోటీసులు జారీ చేయటం, ఆర్టీసీ కార్మికులకు చెందిన పీఎఫ్ డబ్బులు 760 కోట్ల 62 లక్షల రూపాయలు జమ చేయనట్టుగా తమ దృష్టికి వచ్చిందని నోటీసుల్లో పేర్కొనటం అంతా ప్రభుత్వ కక్ష పూరిత చర్యలే అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ ప్రావిడెంట్ ఫండ్ నోటీసులు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. కార్మికుల ప్రావిడెండ్ ఫండ్ ను ఎప్పటికప్పుడు చెల్లించని పక్షంలో భారీ జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

tags: TSRTC strike, TS RTC, RTC workers, providend fund, dues, notices , Telangana government

తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో కీలక మలుపులు

అయోధ్య తీర్పు నేపధ్యంలో రైల్వే భద్రత పై కీలక నిర్ణయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *