ఈనాడు సీనియర్ ఫోటోగ్రాఫర్ రాజమౌళి మృతి

Eenadu Sr Photographer Rajamouli Dead

ఈనాడు సీనియర్ ఫోటోగ్రాఫర్ రాజమౌళి సోమవారం రాత్రి మృతి చెందారు.  ఈనాడు పత్రికలో కొన్నేండ్ల నుంచి ఫోటోగ్రాఫర్ గా సేవల్ని అందించారు. మృదుస్వభావి, అందరితో కలుపుగోలుతనం, మంచితనానికి మారుపేరుగా రాజమౌళి తెలుగు మీడియా వర్గాల్లో సుపరిచితమే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన తత్వమని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 55 ఏండ్ల రాజమౌళి ఉద్యోగరీత్యా ఎండలో తిరిగి డి హైడ్రేషన్ కు గురయ్యాడు. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయని తెలిసింది. ఆదివారం సాయంత్రం నలతగా ఉందని తన భార్యతో పాటు మల్కాజిగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారని సమాచారం. అక్కడ పరీక్షించే సమయంలో తన మెమరీ కోల్పోవడం, వింతగా ప్రవర్తిస్తుంటే వైద్యుల సలహా మేరకు సికింద్రాబాద్ యశోద కు తీసుకెళ్లారు. అక్కడ చేర్పించి చికిత్స అందిస్తుండగానే నిన్న రాత్రి బ్రెయిన్ లో బ్లీడింగ్ ఆగక చనిపోయాడని తెలిసింది. ఏదీఏమైనా రాజమౌళి హఠాన్మరణం జర్నలిస్టులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. ఆయనతో కలిసి పని చేసినవారంతా రాజమౌళి మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే కరోనా దెబ్బ, పైగా ఉద్యోగంలో పెరిగిన ఒత్తిడి, బయట పెరిగిపోయిన ఎండ.. మొత్తానికి, ఈనాడుకే జీవితాన్ని అంకితం చేసిన ఆయన మరణం సాటి జర్నలిస్టుల్ని కలవరపాటుకు గురి చేసింది.

ఈనాడు సీనియర్ ఫోటోగ్రాఫర్ రాజమౌళి మృతికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజమౌళి ఆకస్మిక మృతి బాధాకరం. పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. రాజమౌళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాజమౌళి ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.

Telangana Live News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *