నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష లైవ్?

Pill in Supreme For Nirbhaya Case
నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష కు కౌంట్‌ డౌన్ మొదలైంది. అధికారుల నుంచి పలానా రోజు ఉరి తీస్తున్నామని ప్రకటన రాకపోయినా.. తలారి కోసం వెతుకులాట, ఉరి తాళ్లను సిద్దం చెయ్యడం లాంటి పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వారిని త్వరలోనే మరణ శిక్ష ఖాయమని  ప్రచారం రోజురోజుకూ జోరందుకుంటుంది. అయితే నిర్భయ దోషుల ఉరి శిక్షకు సంబంధించి సుప్రీంలో సంచలన పిల్ దాఖలైంది. ఆ నలుగురు దోషులకు ఉరి వేయడాన్ని టీవీ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ  పిటిషనర్ కోరారు. అంతేకాదు అమెరికాలో మాదిరిగా నిర్భయ పేరెంట్స్ సమక్షంలో దోషులను ఉరి తియ్యాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.కాకపోతే ఉరి విషయంలో మరికొన్ని రోజులు జాప్యం జరిగేలా కనిపిస్తుంది.  దోషిగా నిర్థారించబడిన  అక్షయ్,  ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న ఈ పిల్‌పై వాదనలు జరగనున్నాయి. మిగిలిన ముగ్గురు దోషులు..పవన్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేయగా..సుప్రీం వాటిని తిరస్కరించింది.

tags : supreme court, nirbhaya case, live streaming, tv channels

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *