శాసన మండలి రద్దుకు మంత్రి పిల్లి…

Pilli Subhash On Scrap Legislative Council

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ సందర్భంగా ఏపీ శాసన మండలిలో అధికార వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. మండలిలో టీడీపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులో సవరణలు సూచించి  బిల్లు ఆమోదం పొందకుండా సెలెక్ట్ కమిటీకి పంపటంలో సక్సెస్ అయ్యింది. ఈ నేపధ్యంలో అధికార వైసీపీలో  ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. మండలి రద్దు చెయ్యాలనే ఆలోచనలో సర్కార్ అడుగులు వేస్తుంది.ఇక  దీనిపై శాసనసభ నేడు చర్చించింది. దీనిపై మాట్లాడిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు మండలిని రద్దు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజా సంక్షేమానికి మండలి ఆటంకంగా మారిందని ఆక్షేపించారు. ఇక శాసనమండలి సభా నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ సైతం ఇదే అభిప్రాయం  చెప్పుకొచ్చారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చోని మండలి చైర్మన్ ను ప్రభావితం చేశారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ గుట్టు బయటపడుతుందనే ఆయన నాటకాలాడుతున్నారని పేర్కొన్నారు. సభాపతులకు, ఛైర్మన్లకు విచక్షణాధికారాలు ఉన్నాయని, వారు కూడా పార్టీ చెప్పినట్టు నడుచుకుంటుంటే ఇక సభ ఔన్నత్యం ఎక్కడుందని ప్రశ్నించారు. శాసనమండలి అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చెయ్యటమే కాదు రద్దు చెయ్యాలని ప్రతిపాదించారు.

Pilli Subhash On Scrap Legislative Council,AP council ,  capital decentralization bill, ycp ministers ,  chairman shareef , minister pilli subhash chandrabose , revoke,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *