శభాష్ విష్ణు.. టైగర్ బిడ్డ అనిపించుకున్నవ్

PJR Son Vishnu Clarity on Party Change

పీజేఆర్ అంటే పేదప్రజలకు ఎక్కడ్లేని ప్రేమ. ఆయన కొడుకంటే అంతకుమించిన అభిమానం. అయితే, ప్రత్యర్థుల అంచనాలను పసిగట్టడంలో విఫలమవ్వడంతో విష్ణువర్దన్ రెడ్డి ఓడిపోయాడు. కాకపోతే, ఆయన నేటికీ తన అనుచరులకు అందుబాటులోనే ఉంటాడు. ఎవరు పిలిచినా వెంటనే వారిని కలిసి వారి క్షేమసమాచారాలను తెలుసుకుని అండగా ఉంటాడు. కాకపోతే, పరిస్థితులు మారిపోవడంతో విష్ణు పార్టీ మారుతాడనే కొంతకాలం నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో, ఆయన చేసిన ప్రకటన పీజేఆర్ అభిమానులంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. టైగర్ బిడ్డ అనిపించుకున్నవ్ అని ప్రశంసిస్తున్నారు. పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగాడని కొనియాడుతున్నారు. ఇంతకీ విష్ణు ఏమన్నాడంటే..

కాంగ్రెస్ నేత, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారుతున్నారు అన్న వార్తలపై స్పందించారు. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అందులో నిజం లేదన్నారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పినా బీజేపీలోకి వెళ్లను అని విష్ణు స్పష్టం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నామని, భవిష్యత్తులోనూ కాంగ్రెస్ లోనే ఉంటానని విష్ణు తేల్చి చెప్పారు.మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు వార్తలొచ్చాయి. త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇప్పటికే తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలతో విష్ణు చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై విష్ణు క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరికలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2024లోపు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీలోకి చేరాలనుకునే వారిని.. కీలక నేతలకు బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు.

telangana congress updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *