నేడు తిరుమలకు ప్రధాని

Spread the love

PM VISITS TIRUMALA

  • శ్రీవారిని దర్శించుకోనున్న నరేంద్ర మోదీ
  • అనంతరం ఢిల్లీకి పయనం

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తిరుమల రానున్నారు. గతంలో ప్రధాని హోదాలో రెండుసార్లు తిరుమల వచ్చిన ఆయన.. తాజాగా రెండసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇక్కడకు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో నుంచి బయలుదేరి 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని బీజేపీ ఏర్పాటు చేసిన సభకు హాజరై వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధానికి స్వాగతం పలికిన తర్వాత గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ రోడ్డు మార్గంలో తిరుమల వెళతారు. తిరుపతిలో సభ ముగిసిన తర్వాత 5.10 గంటలకు ప్రధాని రోడ్డు మార్గంలో తిరుమల వెళతారు. సాయంత్రం 6 గంటలకు తిరుమల చేరుకుని, తొలుత అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి వెళతారు. అక్కడ గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ఆలయ అధికారులు సంప్రదాయ రీతిలో పూర్ణకుంభంతో మోదీకి స్వాగతం పలుకుతారు. ప్రధాని, గవర్నర్, సీఎం తదితరులు మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆలయంలో పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రధాని నేరుగా అక్కడి నుంచి బయలుదేరి 8.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి వీడ్కోలు పలుకుతారు. ప్రధాని అక్కడ నుంచి 8.15 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *