పోర్ను వీడియోలు, నగ్న సెల్ఫీలు?

6
Porn videos In Sanjana, Ragini mobiles
Porn videos In Sanjana, Ragini mobiles

Porn videos In Sanjana, Ragini mobiles

డ్రగ్స్ కేసు రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. దిమ్మితిరిగిపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న కన్నడ హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది మెడకు సెక్స్‌ రాకెట్‌ కేసు కూడా చుట్టుకుంది. డ్రగ్స్ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్న సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు ఆశ్యర్యపోయే విషయాలు గుర్తించారు. సంజన, రాగిణి మొబైల్స్‌ పరిశీలించగా.. వాటిలో ఇతర నటీనటుల పోర్న్ వీడియోలు, నగ్న సెల్ఫీ ఫొటోలు కనిపించడంతో కంగుతిన్నారు. దీంతో డ్రగ్స్‌తోపాటు సెక్స్‌ రాకెట్‌తోనూ సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో మరింత లోతైన విచారణ చేపట్టారు.

సెక్స్‌ రాకెట్‌కు సంబంధించి ఓ వాట్సాప్‌ గ్రూపును కూడా నిర్వహించేవారని, డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆ గ్రూపును తొలిగించారని పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సాయంతో ఆ గ్రూపులోని సమాచారాన్ని రికవరీ చేశారు. ఆ గ్రూపులో ఉన్న వారందరికీ నోటీసులు పంపి వారిని కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణ లోతుగా సాగితే ఎలాంటి వాస్తవాలు బయట పడుతాయోనని పలువురు చర్చించుకుంటున్నారు.