హైవేపై పోర్న్ వీడియోస్….

Porn Videos Play On Highway Billboard In Michigan

హైవేపై పోర్న్ వీడియోస్ ప్లే అవ్వడం సంచలనంగా మారింది. మనం హైవేపై వెళ్తున్నపుడు కొన్ని బిల్‌బోర్డులు కనిపిస్తుంటాయి. ఆ బోర్డులపై సామాన్యంగా ఏమైనా ప్రచార వీడియోలు, లేదా ప్రయాణికుల క్షేమం కోసం అధికారుల ఏమైనా సలహాలు సూచనలు చేస్తుంటారు. అయితే అమెరికాలో బిల్ బోర్డుపై పోర్న్ వీడియోస్ ప్రత్యక్షమయ్యాయి. అదేంటి అలా ఎలా జరుగుతుందనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలలోకి వెళ్లాల్సిందే…

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇద్దరు యువకులు చేసిన చిల్లర వ్యవహారం ఇది. బిల్‌బోర్డును కంట్రోల్‌ చేసే గది తమ సెల్‌ఫోన్‌లో ఉన్న పోర్న్‌ వీడియో బిల్‌బోర్డు తెరపై వచ్చేలా చేశారు ఆ యువకులు. ఇక అంతే రాత్రి సమయంలో హైవేపై ప్రయాణించే ప్రయాణికులకు పోర్న్ వీడియోస్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో అందరు అసహనానికి గురయ్యారు. పబ్లిక్ బిల్ బోర్డుపై ఇలాంటి వీడియోస్ రావడమేంటని అధికారుల్ని ప్రశ్నించారు. ఇక కొందరైతే ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై బిల్‌బోర్డ్‌ గది సీసీ టీవీ ఫొటేజ్‌ల ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని గుర్తించి వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Porn Videos Play On Highway Billboard In Michigan,Michigan highway,#Michiganbillboard,Police,CC Camers,Pornographic video,highway billboard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *