Postal Ballot To 65 Years People
కరోనా వైరస్ నేపథ్యం లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పై బడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతే కాకుండా కోవిడ్ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి సైతం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది చివరిలో బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కరోనా కాలంలో ఓటర్లు పెద్ద ఎత్తున లైన్ లో నిలుచోవడం కరోనా వ్యాప్తి కారణమవు తుందని ఈ సందర్భంగా సీఈసీ అభిప్రాయ పడింది. ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు విదేశాల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరి కొంత మంది సిబ్బంది కి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే వీలుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం తో 65 ఏళ్లు పై బడిన ప్రతి ఒక్కరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ను వినియోగించుకునే అవకాశం ఉంది.