శబరిమలపై తీర్పు వాయిదా

Postpone Judgment On Sabarimala
ఎతో కాలంగా శబరిమల లో మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదానికి నేడు సుప్రీం జడ్జ్ మెంట్ తో తెర పడుతుందని భావిస్తే ధర్మాసనంలో భేదాభిప్రాయలతో కేసు తీర్పు వాయిదా పడింది. చారిత్రాత్మకమైన, ప్రతిష్ఠాత్మకమైన శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది. దీనిపై మరింత విస్తృత పరిశీలన అవసరమని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ కేసును ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలనకు పంపించింది. గురువారం ఉదయం దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి.శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి అనుమతి ఇచ్చే విషయంలో  మహిళలకు ప్రవేశాన్ని నిషేధించడాన్ని  ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించారు. మరో ఇద్దరు దీన్ని తిరస్కరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, ఖన్విల్కర్, ఇందు మల్హోత్రా మహిళల ప్రవేశానికి నిషేధించడానికి అనుకూలంగా ఉండగా.. జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వారికి ప్రవేశం కల్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ తీర్పును పెండింగ్ లో ఉంచారు. ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పున: సమీక్షించాలని సుప్రీం నిర్ణయం తీసుకొన్నది.
tags : kerala, shabarimala, women entry, review petitions, supreem court, ranjan gogoi, final judgement, verdict, stay,  larger Bench
http://tsnews.tv/raffel-deal-review-petitions-supreme-court-dismissing/
http://tsnews.tv/final-verdict-on-womens-entry-into-sabarimala/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *