పుట్టిన రోజు కానుకగా…

Prabas Birthday Gift

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఇవాళ. అభిమానుల కోసం బర్త్ డే గిఫ్ట్ ను అందించాడు. తాను టైటిల్ పాత్ర పోషిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్` మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్` పేరుతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్ అభిమానులకు తెగ నచ్చేసింది.

`సాహో` తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ పీరియాడిక్ లవ్‌స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. పూజ హెగ్డే హీరోయిన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *