ప్రభాస్ ఆదిపురుష్ ను పట్టించుకోవడం లేదా

1
prabhas adipurush
prabhas adipurush

prabhas adipurush

ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాకు సంబంధించి అన్ని అంశాలూ దగ్గరుండి మరీ చూసుకుంటాడు. కానీ ప్రభాస్ ఈ విషయంలో చాలా వెనకబడి ఉంటాడు అనే కమెంట్ ఎప్పటి నుంచో ఉంది. అంటే తను చేస్తోన్న సినిమాకు సంబంధించి కథ వరకూ వింటాడు. ఆ తర్వాత ఇతర విషయాలు పట్టించుకోడు అంటారు. అందుకు మరోసారి ఆదిపురుష్ పై వస్తోన్న న్యూస్ మరింత ఊతం ఇస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ తప్ప మరో విషయం ఏదీ అతను పట్టించుకోవడం లేదట. అలాగే దర్శకుడు సైతం తన నిర్ణయాలు తనే తీసుకుంటున్నాడు. విలన్ నుంచి టెక్నీషియన్స్ వరకూ ఏదీ ప్రభాస్ ను సంప్రదించడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. విలన్ గా సైఫ్ అలీఖాన్ ను తీసుకున్న విషయం ప్రభాస్ కూడా సోషల్ మీడియాలో చూసే తెలుసుకున్నాడట. ఇక హీరోయిన్ విషయంలోనూ ఇదే జరుగుతుందీ అంటున్నారు. మామూలుగా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల విషయంలో దర్శకులతో పాటు హీరోలు కూడా పూర్తి స్తాయిలో ఇన్వాల్వ్ అవుతారు. అన్ని నిర్ణయాలు కలిసే తీసుకుంటారు.

ఇంకా చెబితే హీరో చెప్పిందే ఫైనల్ అవుతుంది. బట్ ఎందుకో ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఆ చొరవ చూపించడం లేదట. ఇక సంగీత దర్శకుడి విషయంలో మాత్రం ఎందుకో ప్రభాస్ కీరవాణి అయితే బావుంటుంది అని సజెస్ట్ చేసినట్టు టాక్ వస్తోంది. కానీ అటు నిర్మాణ సంస్థ కానీ, దర్శకుడు కానీ ఈ విషయంలో మరీ ఎగ్జైటింగ్ గా లేరు అనేది టాక్. అయితే ప్రభాస్ ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాలేకపోతుండటానికి కారణం అతను హిందీ భాషపై పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉండటమే అనేది ఆయన టీమ్ నుంచి వస్తోన్న సమాచారం. అంటే ఇది పురాణ కథ కాబట్టి.. అందుకు తగ్గ డిక్షన్, మాడ్యులేషన్ పై హిందీ భాషలో కాస్త క్లిష్టంగా ఉంటుంది కాబట్టి.. ట్యూటర్ ను పెట్టుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నాడనీ.. ఆ కారణంగానే ఆదిపురుష్ కాస్ట్ అండ్ క్రూ మేటర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం లేదంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ టీమ్ మాత్రం ఆదిపురుష్ ష్యూర్ షాట్ అనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.

tollywood news