ప్రభాసూ.. మరీ ఇంత గుంభనమైతే ఎలా బాసూ..?

prabhas low profile

రెబల్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్.ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ స్టార్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మంచి కథలు ఎంచుకుంటే రాబోయే రోజుల్లో ఇండియన్ సూపర్ స్టార్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అతనికి నార్త్ ఇండియన్ ఫ్యాన్ బేస్ చెబుతోంది. అందుకే ఆ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బాహుబలి 2 తర్వాత భారీ అంచనాలతో వచ్చిన సాహో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. అయితే కమర్షియల్ గా మరీ అంత లాస్ వెంచర్ కాదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు నెక్ట్స్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వీరి ఉత్సాహానికి లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. అయితే లాక్ డౌన్ అనౌన్స్ అయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతుగా భారీ విరాళం అందించిన డార్లింగ్ ఆ తర్వాత పూర్తిగా కామ్ అయిపోయాడు. ఇతర హీరోలు కనీసం సోషల్ మీడియాలో అయినా కనిపిస్తున్నారు. కొందరు స్టార్స్ బాగా సందడి కూడా చేస్తున్నారు. కానీ ప్రభాస్ నుంచి ఆ ఫెసిలిటీ కూడా లేదు. మామూలుగా అంతకు ముందు నుంచే తన సినిమా గురించి ఏ అప్డేటూ ఇవ్వలేదు.

అటు మూవీ ప్రొడక్షన్ హౌస్ సైతం ఈ సినిమా విషయంలో చాలా సీక్రెట్స్ మెయిన్టేన్ చేస్తున్నారు. ఓ దశలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ నిర్మాణ సంస్థపై గుస్సా అయ్యారు కూడా. అయినా అవేవీ పట్టించుకోలేదు వాళ్లు. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు.. ఈ మూవీకి సంబంధించి ఓ కీలకమైన విషయాన్ని అనౌన్స్ చేస్తుంది నిర్మాణ సంస్థ అని వినిపిస్తోంది. కానీ అది వచ్చేవరకూ గ్యారెంటీ లేదు. రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ డియర్(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పూజాహెగ్డే హీరోయిన్. 1960ల నేపథ్యంలో యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ చిత్రం అంటున్నారు.  ఈ సినిమాకు సంబంధించే ఏ క్లూ లేకుండా పోయింది. అయితే ప్రభాస్ తన ఫ్యాన్స్ గురించి అస్సలు పట్టించుకోకపోవడం కొంత ఆశ్చర్యం అనే చెప్పాలి. ఎంత సిగ్గరి అయినా మరీ ఇంత గుంభనంగా ఉంటే కష్టం బాసూ. ఏదేమైనా ఈ సారి నిర్మాణ సంస్థ ప్రకటించే ఏ అంశంమైనా సరే.. ఇన్నాళ్ల ఫ్యాన్స్ బాధను తీర్చేలా ఉండాలి. ఉంటేనే ఊరుకుంటారు. లేదంటే మళ్లీ హ్యాష్ ట్యాగ్స్ అంటూ ట్రెండింగ్స్ చేస్తూ ఇబ్బంది పెడతారు.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *